గుండె నొప్పిని ఎలా గుర్తించాలి? రాకుండా జాగ్రత్తలు

updated: February 27, 2018 13:07 IST

ఒకప్పుడు హార్ట్ ఎటాక్  అంటే 60 ఏళ్లు దాటిన వారిలో మాత్రమే   కన్పించేంది. ప్రస్తుతం వయసుతో పనిలేయకుండా అన్ని వయసుల వారీలో ఈ సమస్య బయట పడుతోంది. చిన్న వయ్సుసు వాళ్లు కూడా ఉన్నట్లుంది కుప్ప కూలిపోతున్నారు. ఈ నేపధ్యంలో గుండె జబ్బులు రాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తులు తీసుకోవాల్సిందే అంటున్నారు హృద్రోగ నిపుణులు. అవేమిటో ఇక్కడ చూద్దా..

 గుండె జబ్బులకు అతి పెద్ద ముప్పు కారకం అధిక రక్తపోటు(హైబీపీ). బీపీ ఎక్కువగా ఉన్నా సరే ఎటువంటి హెచ్చరికలు, లక్షణాలు, సంకేతాలు కన్పించవు. లోలోన అది తీవ్ర నష్టం చేస్తుంది. 30 ఏళ్లు దాటితే కనీసం మూడు నెలలకు ఒకసారి బీపీ చూసుకోవడం అవసరం. రక్తపోటు 120/80-130/80 దగ్గరగా ఉండాలి. లేదంటే వైద్యులను సంప్రదించడం ఎంతో అవసరం.

 

కూర్చొని చేసే ఉద్యోగాల్లో ఎక్కువ మంది శారీరక శ్రమకు దూరంగా ఉంటున్నారు. నగరంలోను అదే పరిస్థితి ఉంది. వా రంలో కనీసం అయిదు రోజుల పాటు అరగంట పాటు వ్యాయామానికి కేటాయించినా...చాలావరకు గుండె జబ్బులకు దూరంగా ఉండొచ్చునని నిపుణులు సూచిస్తున్నారు.

అలాగే ఎక్సరసైజ్ లు కోసం పని గట్టుకుని జమ్ కు వెళ్లక్కర్లేదు. శక్తిని ఖర్చు చేస్తూ కండరాలకు బలాన్నిచ్చే ఏ పనైనా...అంటే పిల్లలతో ఆడటం, నడవటం, నాట్యం, ఏం చేసినా మంచిదే. చాలామంది ఆ సమయం కూడా కేటాయించలేని పరిస్థితి నగరంలో ఉంది. ఆ విషయంలో పద్దతులు మార్చుకోవాలంటున్నారు డాక్టర్స్.  దీనితో పాటు మన ఎత్తు బరువుల నిష్పత్తి(బీఎంఐ) 25 లోపు ఉండాలి. 

సిటీల్లో  గుండెజబ్బులకు ప్రధాన కారణాల్లో పొగ అలవాటు ఒకటి. ఈ  అలవాటు ఉంటే తక్షణం మానేయడం మంచిది. 

దీనికి తోడు ఈ రోజున పల్లె, పట్టణం అనే తేడా లేకుండా అంతటా  మధుమేహ రోగులు కనపడుతున్నారు. నగరాల్లో అయితే పరిస్దితి మరీ దారుణంగా ఉంది.  మధుమేహం ఉన్నవారిలో 60 శాతం మరణాలకు గుండెపోటు, పక్షవాతాలే కారణం. మధుమేహాన్ని నియంత్రణలో పెట్టుకోవడం చాలా అవసరమని వైద్యులు సూచిస్తున్నారు. 

గుండె నొప్పిని ఎలా గుర్తించాలి

 ఛాతిలో నొప్పి రాగానే అది గుండెనొప్పి అని భయపడేవాళ్లు కొందరైతే ఏ అసిడిటినో అని నిర్లక్ష్యం చేసేవాళ్లు మరికొందరు. అయితే 40 ఏళ్లు దాటిన తర్వాత తరచూ ఛాతిలో మంట వస్తుంటే అది గుండె నొప్పి అవునో...కాదో తెలుసుకోవాలి.

 ఛాతి మధ్యభాగంలో నొప్పి మొదలై పొట్టలోకి, చేతుల్లోకి, వెనుకవైపునకు పాకినట్లు అయితే...నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి. నొప్పి ఉన్నప్పుడు విపరీతమైన చమట వస్తుంది. అరగంట గడిచినా నొప్పి తగ్గకపోతే కచ్చితంగా గుండె నొప్పిగా అనుమానించాలి.

  ముఖ్యంగా 40 ఏళ్లు దాటిన తర్వాత ఏడాదికి ఒకసారైనా ఈసీజీ, ఎకో, టీఎంటి, యాంజియోగ్రామ్‌ చేయించుకోవాలి. ఛాతి నొప్పి ఎందువల్ల వచ్చినా సరే...ముందు గుండె నొప్పి కాదని నిర్ధారణ చేసుకోవడం అవసరం. 

comments